వీణాపాణి వరదాయినీ
శ్వేతపద్మ స్థిర విలాసినీ
స్వచ్ఛ వాక్ర్పదాయినీ
నిత్య నిర్మల నీరాజనీ
హంసవాహన సంచారీ
సుస్మిత దరహాసినీ
విలసిత రూపకామినీ
విజయ వింధ్య వాసినీ
విమల కరతల విభూషిణీ
సకల కళా సామ్రాజ్ఞీ
శోభాలంకృత కుంకుమ శోభినీ
సంగీత సాహిత్య సమలంకృతీ
నిగూఢ వేదాంత రహస్య ప్రదీప్తినీ
చారుగుణ సమ్మోహినీ
విబుధ స్తోత్ర నిత్య సంతోషిణీ
సకల దేవతా స్తుత స్తోత్రిణీ
మునిగణ సేవిత విద్యా దాయినీ
బాల ముకుళిత గాన వినోదినీ
కుసుమిత కోమల వాగ్దాయినీ
నిత్యాభిషేక సంపత్ర్పదాయినీ
బాసర,వర్గల్ నివాసినీ
నమామి మత్కరావలంబినీ